సత్యసాయి: ధర్మవరం సీనియర్, జూనియర్ కోర్టులలో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ (ఏజీపీ)గా సుబ్బారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత 26 సంవత్సరాలుగా ధర్మవరం కోర్టులో సివిల్, క్రిమినల్ కేసులలో న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. సుబ్బారావు నియామకంపై ధర్మవరం న్యాయవాదులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.