NDL: బనగానపల్లెలోని పెండేకంటి ఇండోర్ స్టేడియంలో శనివారం నుంచి బీసీ రాజారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సురేష్, మనోహర్ తెలిపారు. రెండు రోజుల పాటు 3 కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయి. విజేతలకు కేటగిరీల వారీగా రూ. 12 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు.