ATP: ప్రసిద్ధి చెందిన కడప పెద్ద దర్గాపై దుష్ప్రచారం చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ సీఐ నాగార్జున తెలిపారు. అనంతపురం నగరానికి చెందిన షకిల్ షఫీ, నూర్ బాబా, బాజీలు ఇటీవల దర్గాపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో దర్గా మేనేజర్ అలీ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.