GNTR: పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఇందులో భాగంగా, 11వ వార్డులో డ్రైనేజ్ సమస్య, మంచినీటి కుళాయిల లీకేజీలను ఆయన గుర్తించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను, సిబ్బందిని ఆయన ఆదేశించారు.