ప్రకాశం: జిల్లాలోని 38 మండలాల్లోను ఒక్కొక్క గ్రామంలో ఈనెల 20వ తేదీ నుంచి రీసర్వేను ప్రారంభిస్తున్నట్లు జేసీ గోపాలకృష్ణ చెప్పారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో రీసర్వేపై సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 18 గ్రామాల్లో 138 బ్లాకులుగా ఏర్పాటుచేసి 45,104 ఎకరాలను సర్వే చేయనున్నట్లు తెలిపారు. అందుకు 106 మందితో బృందాలను ఏర్పాటు చేశామన్నారు.