ప్రకాశం: శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. సభలను జయప్రదం చేయాలని కందుకూరు ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు చేకూరి దుర్గాప్రసాద్, బొజ్జ చంద్రమోహన్లు కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు.