నెల్లూరు: నగరంలోని మాగుంట లే ఔట్ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాత్రి స్వామివారికి పల్లకి సేవ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.