నెల్లూరు: సీతారామపురం సబ్ స్టేషన్ వద్ద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. సీతారామపురం జాలిఫ్రెండ్స్, పబ్బులేటిపల్లి జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సీతారామపురం జట్టు విజేతగా నిలిచింది. విజేతకు రూ. 10 వేలు, రన్నర్స్ జట్టుకు రూ.5 వేలు, మూడోస్థానంలో నిలిచిన గంధంవారిపల్లి జట్టుకు రూ.3 వేలను టోర్నమెంట్ నిర్వాహకులు అందజేశారు.