కోనసీమ: రావులపాలెంలోని పోతంశెట్టి రామిరెడ్డి పార్కులో కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న సంక్రాంతి సంబరాలు, వేమన జయంతి వేడుకలు శనివారం ఘనంగా ముగిసాయి. ఈ వేడుకలకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. వేడుకలను ఘనంగా నిర్వహించిన సీఆర్సీ కమిటీని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.