కడప: ఖాజీపేట మండల పరిధిలోని పుల్లూరు గ్రామ సచివాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది హాజరు పట్టికలో సంతకాలు చేసి కార్యాలయంలో లేకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, లేకపోతే ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.