ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత గొరిదిండ్ల నుంచి ఆత్మకూరు వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత ప్రయాణంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ పథకంతో ఆర్థికంగా మహిళలకు మేలు జరుగుతోందని అన్నారు. దీన్ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు దుష్ప్రచారానికి దిగుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.