సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని ఎన్డీయే కార్యాలయంలో గురువారం మెప్మా సభ్యులతో మంత్రి సత్య కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, మెప్మా పీడీలు, సీవోలు పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, సమగ్ర అభివృద్ధి సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని మంత్రి అధికారులకు సూచించారు.