కృష్ణా: పామర్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమార్ రాజా ఆదివారం పర్యటించారు. స్థానిక టౌన్ గగన్ మహల్లో డాకు మహారాజ్ సినిమా రిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కృష్ణా జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ ఛైర్మన్ వల్లూరుపల్లి గణేశ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద కేకు కట్ చేశారు.