KRNL: సి.బెళగల్ మండల కేంద్రంలోని సాహెబ్ మెడికల్ షాప్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జేఎస్ వలి తెలిపారు. కర్నూల్ కిమ్స్ హాస్పిటల్, జేఎస్ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో డాక్టర్ అరుణ పర్యవేక్షణలో బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు. మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.