SKLM: టెక్కలి మండలం సైనిక్ నగర్ సమీపంలో ఉన్న స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్డీవో కృష్ణమూర్తికి సోమవారం బీజేపీ మండల అధ్యక్షులు జర్జాన రాంజీ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్మశాన వాటికలో పూర్తిగా ముళ్ల పోదలు చెత్తాచెదారంతో నిండి కొన్ని ఏళ్ళు నుండి అభివృద్ధి కాక ఉండిపోయిందని తెలిపారు.