NLR: తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామంలోని వైసీపీ సీనియర్ నాయకుడు కూరపాటి కృష్ణారెడ్డి సతీమణి పద్మావతి ఆదివారం గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసి కృష్ణారెడ్డిని పరామర్శించి, ఓదార్చారు.