NDL: వైసీపీపై రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం నాడు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. బనగానపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు చేసినందు వల్లే విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.