CTR: మహిళపై దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పెద్దమండెం ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. ముసలికుంటకు చెందిన మల్లమ్మ ఇంటిముందు ఆముదాలు ఎండబెట్టుకొని ఉండగా, అదే ఊరికి చెందిన చినప రెడ్డి తన ట్రాక్టర్‌తో ఆముదాలు తొక్కించుకుని వెళ్లాడు. ఈ విషయమై చినపరెడ్డిని నిలదీయడంతో ఆగ్రహించిన చినపరెడ్డి, అతని భార్య, పిల్లలు మల్లమ్మపై దాడిచేసి గాయపరిచారు.