అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గంలోని దేవుడి మన్యం భూములను కాపాడాలని బహుజన యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ సర్వే నెంబర్లలో భూములు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.