శ్రీకాకులం జిల్లా కేంద్రంలో నిర్మించనున్న తూర్పు కాపుల సామాజిక భవన నిర్మాణానికి పల్సెస్ సీఈవో గేదెల శీనుబాబు రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు. శనివారం ఎచ్చెర్లలో జరిగిన తూర్పు కాపుల ఆత్మీయ కలయికలో రూ .1 కోటి చెక్కును ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేతులు మీదగా శ్రీనుబాబు తూర్పు కాపుల సంక్షేమ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ పాల్గొన్నారు.