ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని పన్నుల వసూళ్లలో రికార్డు నెలకొల్పింది. గత ఏడాది మార్చి 31నాటికి వసూళ్ల కంటే అదనంగా రూ.10 కోట్లు సాధించిందని కమిషనర్ వెంకటేశ్వరరావు చెప్పారు. సోమవారం అర్థరాత్రి వరకు పెండింగ్ పన్నులను సిబ్బంది కట్టించుకున్నారు. గతేడాది ఆస్తిపన్ను రూ.30.32 కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు రూ. 41.04కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.