CTR: అంతర్జాతీయ క్షయ నివారణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నగర ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్షయ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ANMలు, CHOలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.