సత్యసాయి: రామగిరిలోని ఎంపీడీఓ కార్యాలయంలో నేడు నిర్వహించాల్సిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని మండల ప్రజలు, అధికారులు గమనించాలని కోరారు. రద్దుకు గల కారణాలను మాత్రం ప్రకటనలో వెల్లడించలేదు. తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని కార్యాలయం ప్రకటించింది.