CTR: ఈనెల 5న చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గుణశేఖర్ రెడ్డి తెలిపారు. 18-35 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతం ఉంటుందని పేర్కొన్నారు.