కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బంత్రోతి నాగరాజు(50) మృతిచెందారు. రాజమహేంద్రవరంలో సీఐడీ ప్రాంతీయ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ.. గతేడాది డిసెంబర్ వరకు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఈనెల 2న తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో గురువారం గాంధీపురం-3లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.