NTR: జగ్గయ్యపేట ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా కృష్ణా జలాలను త్రాగునీటిగా సరఫరా చేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా కృష్ణా జలాల ద్వారా త్రాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని ప్రజలు ఈరోజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.