KDP: టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులని మంగళవారం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలోపేతానికి, గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు పదవులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.