ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 22న జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులకు సమాచారం అందినట్లుగా విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కనిగిరి లేదా దర్శి నియోజకవర్గాలలో ఉపాధి హామీ పనుల పరిశీలన కోసం పవన్ కళ్యాణ్ రానున్నారని జనసేన వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.