KRNL: మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని పత్తికొండ రూరల్ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ పులిశేఖర్ అన్నారు. శనివారం తుగ్గలిలోని మంత్రాలయం బెంగళూరు గుంతకల్ రహదారి కూడలిలో వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు.