ELR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా సూపర్ హిట్ అవుతుందని ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నటన కొనసాగిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల వేళ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా ఆదర్శంగా ఉండాలని అన్నారు.