W.G: దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల పరిష్కరించుకోవాలని ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో గ్రివేన్స్ డే నిర్వహించారు. ఈ మేరకు వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలసి స్వీకరించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. మీ కోసంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.