KDP: తక్కువ కాల వ్యవధిలో మంచి లాభాలు చూపించే బెట్టింగ్ యాప్ల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఆత్మహత్యలు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. బెట్టింగ్ యాప్స్ మీద అవగాహన కల్పించేందుకు గౌస్ పీర్ సేన చేపట్టిన బెట్టింగ్ ఆప్లికేషన్లతో జాగ్రత్త అనే పోస్టర్ని డీఎస్పీ ఆవిష్కరించారు.