VZM: ఎస్.కోట మండలం తిమిడిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు ప్రభుత్వం బకాయి పడ్డ 6 వారాల వేతనాలను తక్షణమే చెల్లించాలని ఎస్.కోట నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం తిమిడిలో ఉపాధి నిధులతో చేపడుతున్న మట్టి రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆయనకు ఉపాధి కూలీలు తమ గోడు విలపించుకున్నారు.