ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిపై మండిపడ్డారు. రూ. 1.80 లక్షలకే ఇళ్లు కట్టడానికి ముందుకు వచ్చిన రాక్రీట్ సంస్థపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. సంస్థకు రూ.36 కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉందని తెలిపారు. ఇళ్లు కట్టించి ఇస్తామన్న టీడీపీ హామీ అటకెక్కిందని, ఇది పేదలకు చేసిన మోసమని విమర్శించారు.