కృష్ణా: మొవ్వ మండలం కూచిపూడి నాట్య స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం ప్రముఖ డైరెక్టర్ మారుతిని మంత్రి కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, కూచిపూడి కళకు దేశవ్యాప్త ప్రాచుర్యం ఉందని అన్నారు.