కడప: మారుతున్న సమకాలిన జీవన విధానంలో ప్రతి ఒక్కరూ ఫన్, ఫిట్, ఫుడ్ (f 3)ను పాటించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. పొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం ఫన్, ఫిట్, ఫుడ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మున్సిపల్ కమిషనర్ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య విషయంలో నియమాలు పాటించాలని, అప్పుడే ఆరోగ్యవంతులుగా జీవిస్తారన్నారు.