W.G: తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనిత ఖండించారు. ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మార్పు విషయంలో వస్తున్న వార్తలు ఒట్టి వదంతులే అని కొట్టి పడేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సిగ్గు చేటని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.