ELR: 33 కేవీ విద్యుత్ లైను మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శనివారం జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని త్రీ ఫేజ్ విద్యుత్ సమయాల్లో మార్పు చేయటం జరిగిందని జంగారెడ్డిగూడెం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఆ సబ్ స్టేషన్ పరిధిలోని త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా ఉదయం 6 -10 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందన్నారు.