VZM: జిందాల్ భూ నిర్వాసితుల పోరాటానికి న్యాయస్థానంలో విజయం లభించిందని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు. సోమవారం బొడ్డవరలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను భూముల నుంచి తొలగించరాదని డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా భూసేకరణ సమస్యలతో బాధపడుతున్న రైతులకు దిశానిర్దేశమని పేర్కొన్నారు.