Akp: సాధ్యమైనంత త్వరగా భూ సమస్యలను పరిష్కరిస్తామని నాతవరం మండల ప్రత్యేకాధికారి వీ.నాగశిరీష అన్నారు. శుక్రవారం నాతవరం ఎంపీడీఓ కార్యాలయంలో భూసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.