ATP: జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. 22 మండలాల పరిధిలో 4.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కళ్యాణదుర్గం 17.2, కంబదూరు 15.4, నార్పల 11.6, విడపనకల్లు 11.2, ఉరవకొండ 10.6, కుందుర్పి 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ప్రస్తుతానికి 12.9 మి.మీ నమోదైంది.