అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో వైద్య విద్యను ప్రైవేటు చేతుల్లోకి నెట్టుతున్నదని SFI జిల్లా ఉపాధ్యక్షుడు లతీఫ్ అన్నారు. రైల్వే కోడూరు ఎన్జీవో భవనంలో జరిగిన జిల్లా సమావేశంలో మాట్లాడుతూ.. జీవో 77ను రద్దు చేస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ నిలబడలేదని విమర్శించారు. రూ.4700 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.