ELR: అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమిత్ షా బొమ్మలను దహనం చేశారు. అంబేద్కర్ బొమ్మలను ప్రదర్శిస్తూ మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు