ATP: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కలిశారు. అసెంబ్లీలో కలిసి నియోజకవర్గ రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి, త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.