KKD: జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను సోమవారం నిర్వహించారు. ఈ పరీక్షల శిబిరాన్ని కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత పారదర్శకంగా ఈ దేహదారుడ్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.