KDP: సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రొద్దుటూరులోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 22 మంది లబ్ధిదారులకు 45,05,745 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య పాల్గొన్నారు.