బాపట్ల: పురపాలక సంఘ కార్యాలయంలో ఆదివారం రాత్రి పురపాలక సంఘ ఎలక్ట్రికల్ వర్కర్స్‌తో మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి సమావేశమయ్యారు. పురపాలక సంఘ పరిధిలోని ప్రధాన డివైడర్లు, వార్డులలోని విద్యుత్ దీపాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సెంట్రల్ డివైడర్, వార్డులలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని కమిషనర్ సూచించారు.