SKLM: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి గ్రామానికి ప్రతి ఏటా విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. జూన్ నెలలో ఇక్కడికి వచ్చే ఈ సైబీరియన్ ఫెలికాన్ పక్షులు జంటలుగా ఏర్పడి గుడ్లు పెడతాయి. తిరిగి 6 నెలల తర్వాత డిసెంబర్లో వాటి సంతతితో స్వదేశానికి వెళ్లిపోతాయి. వీటి తిరోగమనంతో ఊరిలో చెట్లు అన్ని బోసిపోతాయని స్థానికులు అంటున్నారు.