NDL: నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జీ డాక్టర్ ధారా సుధీర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ పిలుపు మేరకు శుక్రవారం ‘చలో మెడికల్’ కార్యక్రమానికి నంద్యాలకు బయలుదేరగా, నంది కోట్కూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద వైసీపీ నేతలను పోలీసులు అడ్డగించారు. దీంతో అక్కడే రోడ్డుపై నేతలు బైఠాయించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని పోలీసులను ప్రశ్నించారు.