ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని గురువారం నగర కార్పొరేటర్లు కలిశారు. రామ్‌నగర్‌లోని ఎంపీ మాగుంట క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయనకు ఆభినందనలు తెలిపారు.16వ డివిజన్లో అగ్రహారం రైల్వేగేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ మంజూరుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తరబడి నగర వాసులను చికాకు పెడుతున్న సమస్యకు పరిష్కారం చూపారని వారు కొనియాడారు.